|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:07 PM
ఫిబ్రవరి 15న జరగనున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ను భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ గతంలో తెలిపింది. అయితే, ఈ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషిన్ నఖ్వీతో చర్చలు జరిపిన ఐసీసీ సభ్యుల బృందం, భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మూడు కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది. వార్షిక నిధుల పెంపు, ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, ఆటగాళ్ల ఆన్‌ఫీల్డ్ ఎథిక్స్ పాటించడం వంటివి ఆ షరతులు. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని నఖ్వీ తెలిపారు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.
Latest News