|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:17 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇటలీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ సిలో ఉన్న ఇటలీకి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ప్రస్తుత ఎడిషన్‌లో స్కాట్లాండ్ ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
తుది జట్లు : ఇటలీ జట్టులో జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా, స్మట్స్, వేన్ మాడ్సెన్ (కెప్టెన్), హ్యారీ మానెంటి, బెన్ మనేంటి, జియాన్ మీడే (వికెట్‌కీపర్), గ్రాంట్ స్టీవర్ట్, క్రిషన్, అలీ హసన్, థామస్ డ్రాకా ఉన్నారు. స్కాట్లాండ్ జట్టులో జార్జ్ మున్సే, మైకేల్ జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్(వికెట్‌కీపర్), మార్క్ వాట్, మైకేల్ లీస్క్, ఆలివర్ డేవిడ్సన్, బ్రాడ్ వీల్, బ్రాడ్ క్యూరీ ఉన్నారు.