వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్ర హోం శాఖకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం లేఖ
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 11:03 AM

మాజీ సీఎం జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం లేఖ రాశారు. ఇటీవల జగన్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలని తలశిల రఘురాం లేఖలో పేర్కొన్నారు. జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను కోరారు. తాజాగా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భద్రతా పరంగా తీవ్ర స్థాయిలో లోపాలు కనిపించాయని లేఖలో వివరించారు. ఈ లోపాల పైన విచారణ చేపట్టాలని కోరారు. సాధారణంగా 22 కిలో మీటర్లు ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి.. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా 47 కిలో మీటర్ల మార్గానికి రూట్ మార్పు చేసారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణం రూటు మార్పు చేసారని వివరించారు.జగన్ కు సూచించిన మార్గం అత్యంత రద్దీగా ఉందని.. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వీవీఐపీకి ఏ మాత్రం అనుకూలం కాదని పేర్కొన్నారు. ఈ విధమైన అనూహ్య రూట్ మ్యాప్ లు భద్రతా పరంగా ప్రోటోకాల్స్ ను బలహీన పరుస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి చర్యలతో వీఐపీ కి భద్రతా పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా.. లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న ఈ సడన్ నిర్ణయాలతో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో వివరించారు.

Latest News
6,000 PNG consumers give up LPG connections to help others Sun, Mar 29, 2026, 04:40 PM
IPL 2026: Mumbai Indians set to become first team to play 300 matches Sun, Mar 29, 2026, 04:32 PM
PM Modi says Kerala is ready for change; targets LDF and UDF Sun, Mar 29, 2026, 04:30 PM
One killed, 10 injured as mini-bus strikes motorists in Eastern Afghanistan Sun, Mar 29, 2026, 04:27 PM
Sri Lankan President Dissanayake expresses gratitude to India for swift fuel support Sun, Mar 29, 2026, 03:54 PM