|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 12:04 PM
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, శివస్వాములు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి 12 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు 28,341 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.శ్రీశైలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలో ఒకటైన శివుడు, శక్తిపీఠాలలో ఒక్కరైన భ్రమరాంబ అమ్మ వారు ఒకే ప్రదేశంలో కొలువైన దివ్యక్షేత్రం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు శ్రీశైలంకు తరలి వస్తారు. మరోవైపు శ్రైశైలంకు భారీగా భక్తులు రావడంతో నిన్నన (సోమవారం) తోపులాట జరిగింది.
Latest News