|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 12:49 PM
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ-పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు, వీటిని ప్రీ-పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్ కోసం ఈ-వాలెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మిగిలిన కేటగిరీలకూ దశలవారీగా ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Latest News