దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు తీసేందుకు చంద్రబాబు పూనుకున్నాడు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:35 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకునే  పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ బాధ్యతారహిత­మైన ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అవి అసత్యాలని సీబీఐ–సిట్‌ దర్యాప్తులో తేలడంతో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తన అబద్ధాలను నిజం చేయించుకోవాలని, అవమానకర పరిస్థితుల నుంచి బయ­టపడాలని రోజుకో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హిందూ ఆధ్యాత్మిక మఠాలపైనే తన రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు, ప్రతిష్టను దెబ్బతీసే అపవిత్ర కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవోలో ఓ అధికారికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, టీటీడీలో కొందరు అధికారులు వీరికి సహాయపడుతున్నారు. దక్షిణాది సహా దేశంలోని హిందూ ఆధ్యాత్మిక మఠాలకు వెళ్లి వారిని ఒత్తిళ్లకు గురిచేసి, అసత్యాలు చెప్పి తనకు అనుకూలంగా మఠాధిపతుల చేత లేఖలు విడుదల చేయించడం, వాటిని తమ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించి, దుర్బు­ద్ధితో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని పెద్ద జీయంగార్‌ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది. చంద్రబాబు తన ప్రత్యేక కార్యదర్శి, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్రను పెద్ద జీయర్‌ వద్దకు పంపి తనకు అనుకూలంగా లేఖ రాయించుకున్నారు. వేయి సంవత్సరాల రామానుజాచార్యుల పరంపరనే భ్రష్టుపట్టించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. ఈ కార్యక్రమాల కోసమే ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. వేల సంవత్సరాల ప్రతిష్ట ఉన్న తిరుమల ఆలయాన్ని రాజకీయాలకోసం దెబ్బతీయడం అత్యంత శోచనీయం. శ్రీవారి భక్తులు, మఠాలపై చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో చేస్తున్న దాడిగానే దీన్ని చూడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి ప్రతి ఒక్కరు వాటిని తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Latest News
Census Commissioner to hold key press conference today Mon, Mar 30, 2026, 11:11 AM
Sharjeel Imam to surrender at Tihar jail today as interim bail ends Mon, Mar 30, 2026, 11:09 AM
Siniakova-Townsend complete Sunshine Double with Miami titleSiniakova-Townsend complete Sunshine Double with Miami title Mon, Mar 30, 2026, 11:01 AM
6,000 PNG consumers give up LPG connections to help others Sun, Mar 29, 2026, 04:40 PM
IPL 2026: Mumbai Indians set to become first team to play 300 matches Sun, Mar 29, 2026, 04:32 PM