|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:46 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నిన్న గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని, పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చడాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి స్వాగతించారు. అంబటిపై కక్షసాధింపులకు దిగిన ప్రభుత్వ తీరుకు ఇది చెంపపెట్టు అని వారు తెలిపారు. అంబటి మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దమన్నారు. ఈ వ్యవహారంలో అంబటి రాంబాబును ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని వెల్లడించారు.
Latest News