|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:46 PM
33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం తెస్తున్న నిబంధనలపై వారిలో కలకలం మొదలైందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీల్ని గాలి కొదిలేసిందని ఆయన గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి చేసి వాళ్ల చావులకు కారణమవుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు.
Latest News