|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:47 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు, భౌతిక దాడులకు పాల్పడే విధానాన్ని అమలు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ విమర్శించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబును వీలైనన్ని రోజులు జైలులో నిర్బంధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని ఆరోపించారు. గత 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది రెండు పనులు. ఒకటి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, రెండోది గూండాలను ప్రోత్సహించి ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించడం. రాష్ట్రాన్ని సొంత జాగీరులా మార్చుకుని నియంతలా చంద్రబాబు పాలిస్తున్నారు. ఏపీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు.
Latest News