|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:47 PM
పెరుగు తోడుపెట్టేటప్పుడు పాల ఉష్ణోగ్రతను సరిగ్గా గమనించకపోవడం, ఎక్కువ తోడు వేయడం వల్ల అది త్వరగా పులిసిపోతుంది. పెరుగు గట్టిపడిన తర్వాత అందులో తొక్క తీసిన ఉల్లిపాయలను వేస్తే పులుపు తగ్గుతుంది. పెరుగులోని నీటిని తొలగించి, తెల్లటి బట్టలో వేలాడదీసి గాలి చొరబడని డబ్బాలో ఫ్రిజ్‌లో పెడితే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. పెరుగుపై తేమను తొలగించడం వల్ల ఫంగస్ సోకకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పెరుగును ఆస్వాదించవచ్చు.
మజ్జిగ పులుసు ...పులిసిన పెరుగును కాస్త నీరు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో రెండు టీ స్పూన్ల శెనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సొరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీరు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. రెండు, మూడు కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తరువాత మూత తీసి, కొత్తి మీర చల్లి, కొద్దిసేపు మరగనివ్వాలి. ఇపుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో రెండు నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు , మజ్జిగపులుసు కాంబినేషన్ అదుర్స్ .