|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:53 PM
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మంగళవారం భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.అమరావతితో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీకి అందాల్సిన ఆర్థిక ప్యాకేజీలు, భద్రతాపరమైన అంశాలపై కూడా చంద్రబాబు చర్చించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వంటి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కూడా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ భేటీతో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Latest News