114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్‌ తో భారత్ మంతనాలు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:07 PM

భారత వాయుసేన (IAF) అమ్ములపొదిని మరింత పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) కార్యక్రమంలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారంలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందం దేశ రక్షణ రంగ చరిత్రలోనే అతిపెద్దది కానుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఢిల్లీ పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ ఒప్పందం కేవలం విమానాల కొనుగోలుకే పరిమితం కాదు. ఇందులో భాగంగా దాదాపు 100 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. అత్యాధునిక ఫైటర్ జెట్ టెక్నాలజీ బదిలీతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ డీల్ ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను అత్యధిక సంఖ్యలో వినియోగిస్తున్న దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తుంది.

Latest News
Pakistan's Karachi reports its first case of mpox this year Tue, Mar 31, 2026, 05:01 PM
Impromptu visit: Delhi LG TS Sandhu promises early fix to Kamla Nagar Market woes Tue, Mar 31, 2026, 04:59 PM
India's bioeconomy nears $200 billion, innovation push signals next growth phase Tue, Mar 31, 2026, 04:55 PM
Pakistan: Two passengers offloaded from plane for using umrah visa to enter Europe Tue, Mar 31, 2026, 04:53 PM
SRFI to host World Squash Officiating Refereeing Course in Chennai Tue, Mar 31, 2026, 04:52 PM