|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:21 PM
తమిళనాడు రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ సిద్ధమవుతున్నారు. 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆమె నిర్ణయించారు. తమిళ రాజకీయాల్లో కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయిన ఆమె ఈ చర్య ద్వారా తిరిగి క్రియాశీలక శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.శశికళ వర్గీయుల సమాచారం ప్రకారం ముఖ్యంగా దక్షిణ జిల్లాలు, తేవర్ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో తన పట్టును పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు. తన సోదరుడు వి.కె. దివాకరన్ 2018లో స్థాపించిన 'అన్నా ద్రావిడర్ కళగం' పార్టీ తరఫున ఈ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో కళ్లకురిచ్చి జిల్లాలో ఓ బహిరంగ సభను నిర్వహించి, కార్యకర్తలను సమీకరించాలని యోచిస్తున్నారు.తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న శశికళ అధికారిక ప్రకటన చేయనున్నారు. జయలలిత వారసత్వాన్ని గుర్తుచేస్తూ అన్నాడీఎంకే క్యాడర్‌ను ఆకట్టుకునేందుకే ఈ తేదీని ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Latest News