టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 8 మంది బౌలర్లు వీరే!
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:23 PM

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మొదలైంది. పొట్టి ఫార్మాట్ లో బ్యాటర్లదే హవా అనిపించినా, బౌలర్లు కూడా తమదైన రోజున దిగ్గజ బ్యాటర్లకు దడ పుట్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించిన 8 మంది బౌలర్ల గురించి తెలుసుకుందాం. వీరిలో
1. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)
ఐసీసీ T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ బ్రెట్ లీ. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ 2007లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.


2. కర్టిస్ క్యాంఫర్ (ఐర్లాండ్)
బ్రెట్ లీ తర్వాత, T20 ప్రపంచ కప్‌లో 14 సంవత్సరాల తర్వాత ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ క్యాంఫర్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.  క్యాంఫర్ 2021 T20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు సాధించాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండవ బౌలర్‌గా కర్టిస్ క్యాంఫర్ నిలిచాడు.


3. వనిందు హసరంగా (శ్రీలంక)
శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా 2021 T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించాడు. హసరంగా ఈ ఫీట్‌ను దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. ఇది పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో మూడవ హ్యాట్రిక్.


4. కగిసో రబాడా (దక్షిణాఫ్రికా)
అదే ఏడాది T20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా కూడా హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ పేసర్ రబాడ ఈ ఫీట్ సాధించాడు. T20 ప్రపంచ కప్‌లో ఇది నాల్గవ హ్యాట్రిక్ వికెట్ ఫీట్.


5. కార్తీక్ మయప్పన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన కార్తీక్ మయప్పన్ T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన ఐదవ బౌలర్. మయప్పన్ ICC T20 ప్రపంచ కప్ 2022లో ఈ ఫీట్‌ను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.


6. జోష్ లిటిల్ (ఐర్లాండ్)
T20 ప్రపంచ కప్ 2022లో ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోష్ లిటిల్ ఈ ఫీట్ సాధించాడు. ICC T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 6వ బౌలర్‌గా నిలిచాడు.


7. పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ T20 ప్రపంచ కప్ 2024లో వరుసగా రెండు హ్యాట్రిక్ సాధించాడు. కమ్మిన్స్ మొదటి హ్యాట్రిక్ బంగ్లాదేశ్‌ జట్టుపై సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సైతం హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్ కమ్మిన్స్. కానీ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌నకు అతడు దూరమయ్యాడు.


8. క్రిస్ జోర్డాన్ (ఇంగ్లాండ్)
T20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. T20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన 8వ బౌలర్‌ క్రిస్ జోర్డాన్. 

Latest News
CBI arrests Srinagar EPFO official, aide for bribery Wed, Apr 01, 2026, 04:35 PM
Mizoram leads Northeast region as first state to launch digital Census 2027, self-enumeration drive Wed, Apr 01, 2026, 04:28 PM
Gujarat Dy CM presides over jobs for differently-abled staff, aid to farmers' heirs Wed, Apr 01, 2026, 04:16 PM
CBI files case against Anil Ambani, RCom in Rs 3,750 crore LIC case Wed, Apr 01, 2026, 04:03 PM
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM