|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:29 PM
టీ20 ప్రపంచకప్–2026లో భాగంగా దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియా–నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42), జాన్ ఫ్రైలింక్ (30), జేజే స్మిత్ (22) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్‌బీక్, బాస్ డీ లీడే తలో రెండు వికెట్లు తీశారు. నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నెదర్లాండ్స్ జట్టు 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డీ లీడ్ అర్ధశతకంతో (72*; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోలిన్ అకెర్మాన్ (32; 28 బంతుల్లో, 1 సిక్స్), మిచెల్ లివిట్ (28; 15 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. చివర్లో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ (18*; 9 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టాడు. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్, రూబెన్, జాన్ నికోల్ తలో వికెట్ తీసుకున్నారు.
Latest News