తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:38 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తగ్గి ఎండ తీవ్రత పెరిగింది. గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే మూడు రోజులు రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా కావలిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. నరసాపురం, బాపట్ల, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరిగాయి. రాబోయే రెండురోజుల్లో దక్షిణ కోస్తాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తోంది. రాయలసీమలో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గొచ్చని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల పొగమంచు కురుస్తుందని అంచనా.


 


 

Latest News
Mortal remains of Ujjain student arrive from Canada; CM Mohan Yadav pays tributes Fri, Apr 03, 2026, 12:14 PM
India's fisheries sector draws Rs 39,272 crore investment since 2015, seafood exports double Fri, Apr 03, 2026, 12:09 PM
I want to prove that winning IPL trophy last season was not a one-off, says RCB wicketkeeper Jitesh Fri, Apr 03, 2026, 12:06 PM
US intel finds Iran retains significant strike capacity: Report Fri, Apr 03, 2026, 12:02 PM
UN experts warn of life-threatening health risks for Pakistani activist Idris Khattak Fri, Apr 03, 2026, 11:57 AM