|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:09 PM
టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు ఫిన్ అలెన్ (84 నాటౌట్) టిమ్ సీఫర్ట్ (89 నాటౌట్) కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది అత్యధిక భాగస్వామ్యం. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది.తొలి వికెట్‌కు అజేయంగా 175 పరుగులు జోడించిన సీఫెర్ట్, ఫిన్ అలెన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ పేరిట ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఈ ఇద్దరూ 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో 170 పరుగులు జోడించారు.తాజా మ్యాచ్‌లో 175 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డ్‌ను టీమ్ సీఫెర్ట్, అలెన్ అధిగమించారు.
Latest News