|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:29 PM
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో షుగర్ ఉన్నవారు రాత్రిపూట జొన్న రొట్టె తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకటి లేదా రెండు జొన్న రొట్టెలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని, షుగర్ నియంత్రణలో ఉంటుందని తెలిపారు. రొట్టెలతో పాటు పులుసు కూరలు, సాధారణ కూరలు తినవచ్చు కానీ వేయించిన కూరలు, నాన్-వెజ్ ఫ్రైడ్ ఐటమ్స్ నివారించాలని సూచించారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోశలు వంటివి సగం మాత్రమే తినడం, రాత్రిపూట పండ్ల బౌల్ తీసుకోవడం ద్వారా క్యాలరీలు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలిపారు.
Latest News