అమెరికాలో గడ్డకట్టే చలిలోనూ చిందులేసిన 870 మంది చిన్నారులు
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:26 PM

అమెరికా గడ్డపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరోసారి దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఎప్పుడూ మన సంస్కృతిని కాపాడుకోవడంలో ముందుండే ప్రవాస భారతీయులు.. ఈసారి కూడా అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా న్యూజెర్సీలోని ట్రెంటన్‌లో జరిగిన 'డ్యాన్స్ పే ఛాన్స్' 42వ ఎడిషన్‌లో.. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా సుమారు 870 మంది చిన్నారులు వేదికపై తమ ప్రతిభను చాటారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా డ్యాన్స్ ఈవెంట్ భారతీయ కళావైభవాన్ని మెరిపించింది.


భారత 77వ గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. మైనర్, జూనియర్, సీనియర్, అడల్ట్ కేటగిరీల్లో మొత్తం 18 అకాడమీల నుంచి వచ్చిన కళాకారులు.. 31 అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ స్టైల్స్‌లో ప్రదర్శించిన ఈ నృత్యాలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. బ్రాడ్‌వే స్టైల్ ప్రొడక్షన్, భారీ ఎల్‌ఈడీ బ్యాక్‌డ్రాప్స్, అద్భుతమైన లైటింగ్, రంగురంగుల దుస్తులు ఈ పోటీలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఈ వేడుకను వీక్షించడానికి సుమారు 2,200 మంది వరకు అతిథులు వచ్చారు


కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ అంబి. బినయ ఎస్. ప్రధాన్, ఎఫ్‌ఐఏ (FIA) 2026 ఎగ్జిక్యూటివ్ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత సంతతి కోసం అందుబాటులోకి వచ్చిన విస్తృతమైన కాన్సులర్ సేవలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ పోటీలకు ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే, కొరియోగ్రాఫర్ సుప్రియా దోషి, శాస్త్రీయ నృత్యకారిణి అంతిమా చక్రవర్తి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.


అయితే కార్యక్రమం చివరలో 'బెస్ట్ కొరియోగ్రఫీ', 'థీమాటిక్ ఇన్నోవేషన్', 'అవుట్‌స్టాండింగ్ స్పిరిట్' వంటి విభాగాల్లో విజేతలకు అవార్డులను అందజేశారు. ఎఫ్‌ఐఏ చైర్మన్ అంకుర్ వైద్య, ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి, డీపీసీ చైర్ ప్రీతి రాయ్ పటేల్ మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా ఈ వేదిక ద్వారా వేలమంది యువతను కళాకారులుగా తీర్చిదిద్దడం గర్వంగా ఉందన్నారు. 100 మందికి పైగా వాలంటీర్ల కృషిని కొనియాడారు. 2027లో జరగబోయే 43వ ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలైనట్లు ప్రకటించి వేడుకను ముగించారు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM