|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:29 AM
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (సీపీఐ)–2025 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో భారత్ అవినీతి నిర్మూలనలో 91వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 96వ స్థానంలో ఉన్న భారత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు పెరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన వస్తోందని నివేదిక పేర్కొంది. అయితే, అవినీతిని బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, దీనిపై పాలకులు సరిగ్గా స్పందించడం లేదని నివేదిక ఆక్షేపించింది. ప్రపంచ సగటు సీపీఐ స్కోర్ 42గా నమోదైంది. డెన్మార్క్ 89 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
Latest News