|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:29 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో స్పీకర్ చైర్‌పై పేపర్లు విసిరారు. స్పీకర్ పొడియం చుట్టుముట్టి వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.సభ ప్రారంభమైన కేవలం 11 నిమిషాల్లోనే జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు సభను వీడటం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో వాకౌట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతల ప్రకారం.. ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. తమకు సరైన సమయం కేటాయించకుండా సభను ముందుకు నడపడం తగదని అన్నారు. అలాగే ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు అడగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సభలో తమ స్వరాన్ని వినిపించుకునే అవకాశం లేకపోవడంతో వాకౌట్ చేయడం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Latest News