|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:40 AM
‘పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం.. దేశంలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇదీ చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్..!’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ.. సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెబుతున్న అవాస్తవాలను ఎండగడుతూ.. కూటమి సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయడం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించగలిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు.
Latest News