|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:42 AM
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు వైయస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... లడ్డూ వివాదంపై సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ లోని కీలక ఆధారాలను బయటపెట్టారు.2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కల్తీ నెయ్యి సరఫరా జరిగితే.. వైయస్.జగన్ కి, వైయస్ఆర్‌సీపీ ఏమి సంబంధం అని నిలదీశారు. నాణ్యత లేదని టీటీడీ తిరస్కరించిన నెయ్యినే మరలా టీడీపీ నేతల ఒత్తిడితో వెనక్కి రప్పించి లడ్డూ ప్రసాదంలో వాడారన్న సిట్ నివేదికపై ఏం సమాధానం చెపుతారని నిలదీశారు. లడ్డూలో జంతు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జి షీట్ దాఖలు చేయడంతో ఇప్పుడు చంద్రబాబు శ్రీశైలం లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిశాయని మాట్లాడటానికి చంద్రబాబుకు మనసెలా ఒప్పిందని నిలదీశారు. కూటమి పాలనలో వరుస ఆలయాల్లో అపచారాలు, తొక్కిసలాటలు, శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జీ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు దేవదేవుడికి, భక్తులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News