|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:46 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు, మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. అంతకు ముందు వైయస్ జగన్ మోన్‌రెడ్డి సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండగలా మారిస్తే.. దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో కాకాణి మాట్లాడుతూ... టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో రికార్డులు సృష్టిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలపై పోలీసులు ఓ నివేదిక ఇచ్చారు. 2025లో మొత్తం 2,865 మంది రైతులు, రైతుకూలీలు ఆత్యహత్య చేసుకున్నారు. 2024తో పోలిస్తే దాదాపు 5 శాతం ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఇది రైతాంగాన్ని, సమాజాన్ని కలవరపాటుకు గురిచేసే అంశం. ఎందుకంటే అన్నదాతల ఆత్మహత్యల్ని ఎవరూ అంగీకరించరు. ఈ సమాజం, ప్రజలు కడుపుకు పట్టెడన్నం పెట్టే రైతు చనిపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పెట్టుబడి సాయం చేయకపోవడం, రైతులకు కనీసం యూరియా అందించలేకపోవడం, నకిలీ ఎరువులు, విత్తనాల బెడద, ఉచిత పంటల బీమా తీసేసి, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వేదనకు గురిచేసే పరిస్ధితుల్లో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు చనిపోతున్నారు.
Latest News