|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:49 AM
అంబటి రాంబాబు బయట ఎలా ఉంటారో, జైల్లో కూడా అంతే హుషారుగా ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన ఇంటిపై దాడులు చేసి వీరంగం చేసిన వాళ్లమీద కేసుల్లోవు. ఆయన ఓ మాట అని, దానికీ పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పినా సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇంత దుర్మార్గ పాలన చంద్రబాబు చేస్తారని మాతో పాటు టీడీపీ వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఫ్రస్టేషన్ లో చంద్రబాబు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నట్లుంది. సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, పరిణితి కలిసిన నాయకుడు, గతంలో రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేని అంబటి రాంబాబును ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధించారు?, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కొన్నిసామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారుతోంది. గతంలో అధికారంలో ఉండగా ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇలాగే వేధించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ను అరాచక పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో బీజేపీని కూడా భాగస్వామిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టింది రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాల కోసమా లేక రాజకీయాల కోసమా చెప్పాలి అని డిమాండ్ చేసారు.
Latest News