|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:54 AM
తిరుమల శ్రీవారి లడ్డుపై కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయని తెలిపారు. అయినప్పటికీ అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు నిరాధార ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు లడ్డూలో కెమికల్స్ కలిసాయని మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం దేవుడి పేరును ఉపయోగించడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు లడ్డూ వివాదాన్ని డైవర్షన్ రాజకీయాలుగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
Latest News