|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:04 PM
ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విజయవాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాదనల్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌వీ అంజారియా, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.. అలాగే ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో ప్రదర్శిస్తే.. మీకొచ్చిన బాధేంటి' అంటూ పిటిషనర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 'దీంతో మీకేం సమస్య ఉంది.. ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు' అంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అంశంపై రిటైర్డ్ ఉద్యోగి కొండలరావు ముందు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు కూడా ఆ పిటిషన్‌ను కొట్టేసింది.. దీంతో ఆ తీర్పును కొండలరావు సవాల్ చేశారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Latest News