|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 01:55 PM
ఏపీలో 18 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించేలా చట్టం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర జీఎస్డీపీని 2025-26 నాటికి 17.62 లక్షల కోట్లకు, తలసరి ఆదాయాన్ని 2.95 లక్షల రూపాయలకు పెంచుతుందని, పారిశ్రామిక అభివృద్ధికి వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాల సంఖ్యను 28కి పెంచడం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు.
పౌర సేవలు అన్నీ టెక్నాలజీ ఆసరాతో మరింత సులువుగా వేగంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గవర్నర్ తెలిపారు. పరిపాలనా సంస్కరణలలో భాగంగా టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సులభ రీతిలో పౌర సేవలు అందిస్తోందని అన్నారు. మన మిత్ర వాట్సప్ ద్వారా ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలను దగ్గర చేసిందని గుర్తు చేశారు. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకుని వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇక వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద కృషి చేస్తోందని గవర్నర్ చెప్పారు యువ పారిశ్రామిక వేత్తలు దీనిని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
Latest News