తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత
 

by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:09 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. చలి పూర్తిగా తగ్గిపోయి, ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది వేసవిలో ఎండలు అధికంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వేసవిలో 48 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ముందే చుక్కలు చూపించాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోయాడు.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM