|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:22 PM
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం, రూ.10 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులోనూ గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Latest News