|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:20 PM
ఆకుకూరలు త్వరగా వాడిపోకుండా, తాజాగా, పోషకాలతో నిండి ఉండేలా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఒక సులభమైన చిట్కాను కంటెంట్ క్రియేటర్, హోస్ వైఫ్ శోభా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆకుకూరల మందపాటి కాండాలను కట్ చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసి, పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత, ఒక కంటైనర్ అడుగున కిచెన్ పేపర్‌తో లైన్ చేసి, ఆకుకూరలను ఉంచి, పైన మరో పొర టిష్యూ పేపర్‌ను ఉంచాలి. ఈ టిష్యూ అదనపు తేమను గ్రహించి, ఆకుకూరలను వారం రోజుల వరకు తాజాగా ఉంచుతుంది. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటి వాటికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
Latest News