|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:23 PM
వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు కేసులు పెరుగుతంటాయి. పాములు చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి, వెలుతురును ఇష్టపడవు. కట్లపాము మినహా మిగతా విషపూరిత పాములు కాటు వేసే ముందు 'బుస్ బుస్' అని శబ్దం చేస్తూ హెచ్చరిస్తాయి. పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాములు సంచరించే ప్రాంతాల్లో దోమతెరలు వాడటం, చీకటి ప్రదేశాల్లో వెలుతురు చూసుకుని వెళ్లడం, మందపాటి వస్త్రాలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు.పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు
Latest News