|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 10:58 AM
ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో భారంగా అనిపించడం, తరచుగా తేనుపులు రావడం జీర్ణ సమస్యకు సంకేతాలు. ఆలస్యంగా తినడం, ఎక్కువ భోజనం, టీ/కాఫీ, ఫాస్ట్ ఫుడ్, పిత్తాశయంలో ఎక్కువ పిత్తం ఉత్పత్తి, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల లోపం, పేగు ఇన్ఫెక్షన్లు అజీర్ణానికి కారణాలు. సరైన ఆహారం, జీవనశైలి లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. రాత్రి త్వరగా తినడం, పండ్లు-కూరగాయలు తినడం, తగినంత నీరు తాగడం, వ్యాయామం వంటివి చేయాలని సూచించారు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. కొంత కాలం మసాలా ఆహారాలు, కారం, టీ, కాఫీ, మద్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. దీంతో అసిడిటీ తగ్గుతుంది.జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. ఇది పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వెనుక నుంచి, గొంతులో నుంచి గ్యాస్ తరచూ బయటకు వస్తుంటుంది. అలాగే భోజనం చేసే సమయంలో, భోజనం చేసిన వెంటనే కూడా గ్యాస్ వస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కాస్త ఆహారం తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందుకు పొట్టలో గ్యాస్ పేరుకుపోవడమే కారణం. దీంతో ఎల్లప్పుడూ లేదా భోజనం చేసిన సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు.
Latest News