చంద్రబాబు పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరింది
 

by Suryaa Desk | Thu, Feb 12, 2026, 11:27 AM

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని... ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూలకారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. 

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM