|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:20 PM
విశాఖపట్నంలో టీడీపీ ఎంపీకి చెందిన గీతం వర్సిటీకి భూముల కేటాయింపులకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. మండలిలో గీతం వర్సిటీకి సంబంధించి వైయస్ఆర్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కాపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు అని తెలిపారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్‌సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
Latest News