|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:21 PM
ఏపీలో అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు?. మూడు వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా?. ఐదు వేల కోట్ల విలువైన భూములను విశాఖలోని ఓ విద్యాసంస్థ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెప్తోంది. వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించకోవచ్చా?` అని ప్రశ్నించారు.
Latest News