శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సరికొత్త రికార్డు
 

by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:49 PM

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక చరిత్ర సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని, పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది, ఇది ఈ ఎడిషన్‌లోనే అత్యధిక స్కోరు.


శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే


- దసున్‌ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్‌ మీద 19 బంతుల్లో


-దసున్‌ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో


- మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో


-కుమార్‌ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM