|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:55 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ. 1,200 కోట్లు విడుదల చేయడాన్ని పురస్కరించుకుని విద్యార్థులు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మాధవి నగర్ పాణ్యం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అమ్మ హాస్పిటల్ సర్కిల్ వరకు విద్యార్థులు, కూటమి నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయం పేద విద్యార్థుల చదువును మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నుంచి రక్షించిందని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించిందని తెలిపారు.
Latest News