|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:17 PM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఇటీవల విమర్శలు వస్తుండడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో కొలికపూడితో పల్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీతోనే ఆయనకు గుర్తింపు వచ్చిందని, వ్యక్తిగతంగా ఆయన జీరో అనే విషయాన్ని గుర్తించాలంటూ పల్లా శ్రీనివాస్ హితవు పలికారు. అది గుర్తించి నడుచుకోవాలని సూచించారు.పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను కొలికపూడికి తెలియజేశారు. వాట్సప్ స్టేటస్ లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని పల్లా ఆయనను నిలదీశారు. మందలించినా కూడా పద్ధతి మార్చుకోకుంటే పార్టీ ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని స్పష్టం చేశారు.
Latest News