ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
 

by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:19 PM

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్‌ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు.నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'సాస్కీ' పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్‌లు) సిద్ధం చేస్తున్నామని, తద్వారా కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు క్యాంపస్‌లకు అవసరమైన నిధుల వివరాలను మంత్రి సభకు తెలియజేశారు. నూజివీడు క్యాంపస్‌లో పనులు పూర్తి చేయడానికి రూ.60 కోట్లు, అరకు వ్యాలీలో నిర్మాణాలకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. అదేవిధంగా, ఒంగోలు క్యాంపస్‌కు రెండు దశల్లో కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పనులు పూర్తి చేయడానికి రూ.300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Latest News
IPL 2026: RCB could've won by taking wickets not by defending runs, says Bhuvneshwar Fri, May 01, 2026, 03:04 PM
'Democracy under threat': Pramod Tiwari on Kolkata strongroom row Fri, May 01, 2026, 02:58 PM
Mamata Banerjee has 'panicked' before poll results: BJP MPs on Bengal CM's strong room visit Fri, May 01, 2026, 02:55 PM
Ravi K assumes charge as HAL's CMD Fri, May 01, 2026, 02:48 PM
CM Patel inaugurates Vibrant Gujarat Regional Conference in Surat, focuses on South Gujarat growth Fri, May 01, 2026, 02:41 PM