|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:22 PM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు పీటీ వారెంట్‌పై రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల కేసులో విచారణ కోసం కోర్టులో హాజరుపరిచారు. పోలీసు వ్యాన్ గుంటూరు కోర్టు ప్రాంగణానికి చేరుకున్న తర్వాత వాహనం దిగడానికి ముందు అంబటి రాంబాబు పుష్ప స్టైల్లో 'తగ్గేదేలే' అంటూ స్పందించారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా అంబటి రాంబాబు కూడా వ్యాన్‌లో సీటు మీద కూర్చుని గెడ్డం కింద చేయిని స్టైల్‌గా పెట్టి 'తగ్గేదేలే' అనే స్టైల్లో రియాక్షన్ ఇచ్చారు. ఆయనను కోర్టుకు తీసుకువస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest News