|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:02 PM
తల్లికి వందనం పెండింగ్ బకాయిలు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు చెల్లించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టడమే కాకుండా రెండో ఏడాది కేవలం రూ. 13వేలే ఇచ్చి చేతులు దులిపేసుకుందని.. 15 శాతం మందికిపైగా విద్యార్థులకు రూ. 8 వేలు, రూ. 9 వేలు మాత్రమే ఇచ్చారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలోని విలువైన భూములను 99పైసలకే చంద్రబాబు తన బినామీలకు ఇష్టారాజ్యంగా దారాదత్తం చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం భూకేటాయింపుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు.
Latest News