అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పంచుమర్తి అనురాధ
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:59 PM

నిన్న గుంటూరు కోర్టుకు తరలిస్తున్న సమయంలో 'పుష్ప' సినిమా స్టైల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు 'తగ్గేదే లే' అంటూ సైగలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఆయన 'రప్పా రప్పా' పోజులు ఇచ్చారు. ఈ క్రమంలో అంబటిపై టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను దోచుకున్న అంబటి... ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని పంచుమర్తి మండిపడ్డారు. అంబటిలాంటి అరాచక శక్తులకు కులాన్ని వాడుకునే అర్హత లేదని అన్నారు. కాపులతో పాటు, ఇతర సామాజిక వర్గాలను కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర అంబటిదని దుయ్యబట్టారు. బీసీలను, ఆర్యవైశ్యులను అంబటి దోచుకున్నారని  మండిపడ్డారు. మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన నీచమైన వ్యక్తి అంబటి అని అనురాధ విమర్శించారు. 

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM