|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:04 PM
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Latest News