|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:05 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా గురువారం ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు.మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. తొలుత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు" అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.అనంతరం కావలి మండలం ఆముదాలదిన్నెలోనూ షర్మిల పర్యటించి, ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
Latest News