|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 11:16 AM
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్ ప్రతులను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. 2026-27 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
Latest News