|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 11:54 AM
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ హత్యకు దారి తీసింది. మహారాష్ట్రకు చెందిన సియా(33)ను ఆమె ప్రేమికుడు సమీర్, తన కుటుంబ సభ్యులతో కలిసి గొంతు కోసి చంపాడు. అయితే సమీర్ కు గతంలోనే వివాహం జరగగా.. సియాతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. దీంతో సోమవారం ఆమెను హతమార్చి, మృతదేహాన్ని ఇనుప పెట్టెలో పెట్టి సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. పోలీసులు 24 గంటల్లోనే నిందితులను గుర్తించి కేసును ఛేదించారు.గురువారం ఆ ట్యాంక్ సమీపంలో ఆడుకుంటున్న పిల్లలకు దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినప్పటికీ, ఆమె చేతిపై ఉన్న 'దీపం' పచ్చబొట్టు మరియు "26 మే 1992" అనే పుట్టిన తేదీ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు.ప్రస్తుతం నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, హత్యకు సహకరించిన అతని తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు.మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన సియాకు, భోపాల్‌కు చెందిన సమీర్‌తో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, మూడు నెలల క్రితం ఆమె తన ఇంటిని వదిలి భోపాల్‌కు వచ్చేసింది. అయితే సమీర్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసినా సియా అతనితోనే సహజీవనం చేయడం ప్రారంభించింది.
సమీర్ ఇంట్లోనే సియా ఉండటంతో అతని భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని లేదా రూ.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేయాలని సియా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడంతో సమీర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.గత సోమవారం సాయంత్రం జరిగిన తీవ్ర వాగ్వాదంలో సమీర్ ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని తన తల్లి, సోదరుడు, సోదరికి చెప్పాడు. వారందరూ కలిసి మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కారు. అర్ధరాత్రి సమయంలో ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడేశారు.
Latest News