|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 12:05 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 గానూ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. శనివారం (ఫిబ్రవరి 14) ఉదయం 11:15కి ఏపీ శాసనసభ ముందు ఉంచారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రు పయ్యావుల తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పంతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం 10.30కి బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది
- పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు
- బీసీ వెల్ఫేర్‌కు రూ.23,650 కోట్లు
- వైద్య శాఖకు రూ.19,306 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ.11,745 కోట్లు
- ఇందన శాఖకు రూ.13,934 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.22,941 కోట్లు
- నీటి వనరులకు రూ.18,223 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు
- పోలవరానికి రూ.6,105 కోట్లు
- అన్నదాత సుఖీభవకు రూ.6,600 కోట్లు
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు
- అమరావతి కోసం రూ.6,000 కోట్లు
- తల్లికి వందనం: రూ.9,668 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం: రూ.4,581 కోట్లు
Latest News