|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 12:17 PM
బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. ఈ పసిడి కేవలం అలంకరణకే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో భరోసా ఉంటుంది. ఆపద సమయాల్లో ఈ పసిడినే ఆదుకుంటుంది. అందుకే బంగారాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,800 పెరిగి రూ.1,44,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,970 పెరిగి రూ.1,57,750 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.ఇక, దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1970 పెరిగి... రూ.1,57,900కి చేరింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1800 పెరిగి.. రూ.1,44,750కి చేరుకుంది. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1470 పెరిగి.. రూ.1,44,750కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,80,000 ఉంది.
Latest News