రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
 

by Suryaa Desk | Sat, Feb 14, 2026, 02:04 PM

మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, డిమాండ్ ఆధారిత పంటలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రైతులకు త్వరలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాతావరణ హెచ్చరికల ఆధారంగా రైతులకు సందేశాలు పంపుతున్నామని తెలిపారు.యువత వ్యవసాయం వైపు మళ్లాలంటే రంగం లాభదాయకంగా మారాలని మంత్రి చెప్పుకొచ్చారు. అధిక పోషక విలువలు ఉండే పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం కల్పిస్తామని చెప్పారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం ఉందని, 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని వెల్లడించారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం సాధించిందని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు.

Latest News
UDF likely to reopen Kerala ADM death case, Cong leader says will take up case Fri, May 08, 2026, 02:12 PM
BJP leaders hail Governor's move dissolving West Bengal Assembly Fri, May 08, 2026, 02:07 PM
India's resolve to fight terrorism 'strong as ever': Kirti Vardhan Singh Fri, May 08, 2026, 01:58 PM
Awami League flags 'collapse of social order' as violence against women surges in Bangladesh Fri, May 08, 2026, 01:55 PM
Gold, silver rally up to 1 pc as West Asia tensions escalate Fri, May 08, 2026, 01:17 PM